కరోనా వైరస్ వచ్చి మనుషుల ప్రాణాలు తీస్తుంటే.. ఈ వైరస్ కారణంగా ఉపాధిలేక, మానసికంగా కృంగిపోయి ప్రాణాలు తీసుకుంటున్న వారు మరికొందరు.. ఇలాంటి సంఘటనలు తరచుగా ఎక్కడో ఒకచోట సంభవిస్తూనే ఉన్నాయి.. ఇప్పటికే ఈ వైరస్ వల్ల పేద, మధ్యతరగతి వారి ఆర్ధిక వ్యవస్ద పూర్తిగా చితికి పోగా, కనీసం అప్పు ఇచ్చి ఆదుకునే వారు కూడా కరువైయ్యారు.. ఇలాంటి పరిస్దితుల్లో ఎదురుగా ఉన్న సమస్యను ధైర్యంతో జయించలేక ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు.. ఈ మానసిక వేదన అందరిని ఒకేలా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే..
ఇకపోతే ఇదే కారణంగా తమిళ టీవీ సీరియల్స్‌లో నటించే అన్నాచెల్లెళ్లు శ్రీధర్, అతడి సోదరి జయ కళ్యాణి ఆత్మహత్యకు పాల్పడ్డారు.. చెన్నైలోని కొడంగయ్యూర్‌లో వారు నివసిస్తున్న ఇంట్లోనే ఆత్మహత్య చేసుకోగా, ఈ విషయం ఆలస్యంగా బయటకు పొక్కింది.. అదికూడా వీరు ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి వల్ల నిజం తెలిసింది.. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్దలానికి చేరుకుని ఆ ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా అక్కడ కుళ్ళిన దశలో ఉన్న రెండు మృతదేహాలు బయటపడ్డాయి.
ఇక ఆ మృతదేహాలను వెంటనే పోస్టుమార్టం నిమిత్తం స్దానిక స్టాన్లీ ఆస్పత్రికి తరలించగా, వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇక లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు..