ప్రీ లాంచ్ ఆఫర్లతో మోసాలకు పాల్పడిన కాకర్ల అరెస్టుతో వెలుగులోకి బాధితులు

-

ప్రీ లాంచ్ ఆఫర్లతో మోసాలకు పాల్పడుతున్న కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తిని కెపిహెచ్బి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జయత్రి ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కాకర్ల శ్రీనివాస్ బాధితుల నుంచి 20 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతని అరెస్టుతో మరికొందరు బాధితులు వెలుగులోకి వస్తున్నారు.

arrested
arrested

కెపిహెచ్బి ఆరవ పేజీ లోని జయ గ్రూప్ కార్యాలయానికి బాధితులు చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. “కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాడు. మొదట్లో Ks ఇన్ఫ్రా అనే పేరుతో ఆఫీస్ ఓపెన్ చేసి ప్రి లాంచ్ పేరుతో బాధితులకు కుచ్చుటోపీ పెట్టాడు. Ks ఇన్ఫ్రా కేసులో అరెస్ట్ అయ్యాడు, మళ్ళీ బయటికి వచ్చి జయ ప్రైవేట్ లిమిటెడ్ అని మరో ఇన్ఫ్రా సంస్థ స్థాపించాడు. జయ ఇన్ఫ్రా పేరుతో టెలికాలర్స్ ను నియమించికుని అమాయకులను ట్రాప్ చెయ్యడం మెయిన్ టార్గెట్.

ప్రి లాంచ్ పేరుతో తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టు లు ఉన్నాయి అని నమ్మించి మోసం చేసాడు. జయంతి రిలియబులిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జయంతి ఇన్ ఫ్రా ల పేరుతో ప్రీ లాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డాడు శ్రీనివాస్. విషయం బాధితులకు తెలియడంతో ఘరానా మోసం బయటపడింది” అని తెలిపారు. శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు కెపిహెచ్బి పోలీసులు. తమ డబ్బు రికవరీ చేసి తమకు ఇప్పించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news