పాతబస్తీలో దారుణం..భార్యను చంపేందుకు చేతబడి ప్రయోగం

-

హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం.. చోటు చేసుకుంది. భార్యను చంపేందుకు ఏకంగా చేతబడి ప్రయోగం చేశాడు భర్త. ఈ సంఘటన పాతబస్తీలో.. మంగళవారం చోటు చేసుకుంది. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని భార్యపై క్షుద్ర పూజలు చేశాడు పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి.

స్థానికంగా ఉన్న బాబా సాయంతో భార్యపై చేతబడి పూజలు చేయించాడు పాతబస్తీకి చెందిన వ్యక్తి. అయితే ఈ సమాచారం అందుకున్న కామాటిపురా పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ నిందితుడి ఇంటిపై దాడి చేసి.. దొంగ బాబాను అరెస్ట్‌ చేశారు. అనంతరం మహిళను రక్షించి ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news