ఇంటర్‌ విద్యార్థినికి కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి..

రోజురోజులు అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నావి. దుండగులను గుర్తించి కఠిన శిక్షలు అమలు చేసినా వారిలో మార్పు రావడం లేదు. శిక్ష విధించి జైలుకు పంపడంతో పాటు ఎన్‌కౌంటర్‌ సైతం చేసినా కామాంధుల్లో భయం రావడం లేదు. దీంతో మహిళలు, విద్యార్థినులు ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. హైదరాబాద్‌ ఘట్‌కేసర్‌ సమీపంలో కాలేజీ నుంచి ఇంటికెళ్తున్న బీ ఫార్మసీ విద్యార్థిపై ఆటో డ్రైవర్‌తో పాటు పలువురు ఆఘయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించగా, సిరిసిల్ల జిల్లాలో ఓ ఇంటర్‌ విద్యార్థినికి కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ప్రేమ పేరుతో నమ్మించి..

సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఇంటర్‌ చదివే ఓ విద్యార్థిని (16)ను అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించాడు. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి అర్ధనగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చేశాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెబితే వీడియోలు ఇంటర్నెట్‌లో పెడుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఫొటోలు అడ్డం పెట్టుకొని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బా«ధితులురాలు ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పడంతో బుధవారం వారు పోలీసులను ఆశ్రయించారు. డీఎస్పీ చంద్రశేఖర్‌ ఆ యువకుడితో పాటు అతనికి సహకరించిన మరికొందరిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో విచారిస్తున్నారు. కాగా.. గంజాయి మత్తులో ఆ యువకుడితో పాటు మరికొందరు కలిసి గ్యాంగ్‌రేప్‌ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.