ఆరోగ్య‌శ్రీ‌లోకి బ్లాక్‌ఫంగ‌స్

-

ఏపీలో ప్రస్తుతం కొనసాగుతున్న పగటి పూట కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం పొడగించింది. ఈ నెలాఖరు వరకు అంటే మే 31 వరకు కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ మే 5 నుంచి క‌ర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చింది. ఆ క‌ర్ఫ్యూ మే 18వ తేదీ వ‌ర‌కు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆ గడువు రేపటితో ముగియనుండడంతో తాజాగా ఆ కర్ఫ్యూను మరోసారి పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

 

దీంతో మే 31 వరకు ప్రస్తుతం మాదిరిగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చు. అలానే కర్ఫ్యూ సడలింపు సమయలో జనాల రద్దీని తొలగించేందుకు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. కాగా రాష్ట్రంలో క‌ర్ఫ్యూ విధించి 10 రోజులే అయింద‌ని, క‌ర్ఫ్యూ 4 వారాలు ఉంటేనే స‌రైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని సీఎం జగన్ వెల్ల‌డించారు. కొవిడ్‌తో అనాథ‌లైన పిల్ల‌ల‌ను ఆదుకునేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామని, వారికి ఆర్థిక‌సాయం అంద‌జేసేలా కార్యాచరణ‌ రూపొందించాలనిఅధికారుల‌ను ఆదేశించినట్లు చెప్పారు .

కరోనా బాధితులను వేధిస్తున్న బ్లాక్‌ఫంగ‌స్ కు సంబంధించి కూడా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్‌ఫంగ‌స్ చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీ‌లోకి తీసుకురావాల‌ని సీఎం ఆదేశించిన‌ట్లు వైద్యారోగ్యశాఖ‌ మంత్రి ఆళ్ల‌నాని తెలిపారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 9 బ్లాక్ ఫంగ‌స్ కేసులు గుర్తించిన‌ట్లు వెల్లడించారు. మొత్తం 10 వేల ఆక్సిజ‌న్ కాన్సంటేట‌ర్లకు టెండ‌ర్లు పిలిచామ‌ని… ఈ నెలాఖ‌రుకు 2 వేల‌కు పైగా ఆక్సిజ‌న్ కాన్సంటేట‌ర్లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news