భారీ వైమానిక దాడుల‌తో గాజాలోని సొరంగాలు ధ్వంసం: ఇజ్రాయెల్

-

ఇజ్రాయెల్ సైన్యం సోమవారం తెల్లవారుజామున గాజా ప్రాంతంలో భారీ వైమానిక దాడులకు పాల్ప‌డింది. దీని వ‌ల్ల‌ 15 కిలోమీటర్ల మేర ఉన్న ఉగ్రవాద సొరంగాలు, 9 హమాస్ కమాండర్ల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. గ‌త వారం రోజులుగా యుద్ధం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం జ‌రిగిన దాడిని అతి భారీ దాడిగా స్థానికులు అభివర్ణించారు. దాడుల నేప‌థ్యంలో ఆదివారం 42 మంది చ‌నిపోగా మొత్తం 3 భ‌వ‌నాల‌ను నేల‌మ‌ట్టం చేశారు.

tunnels in gaza destroyed in heavy air strikes

కాగా తాజాగా జ‌రిగిన దాడుల్లో గాయ‌ప‌డిన వారి స‌మాచారం ఇంకా తెలియ‌రాలేదు. ఇక గాజా నగరంలో 3 అంతస్తుల భవనం ఒక‌టి భారీగా దెబ్బతింది. కానీ దాడికి 10 నిమిషాల ముందు సైన్యం తమను హెచ్చరించిందని, ప్రతి ఒక్కరూ క్లియర్ అయ్యారని నివాసితులు తెలిపారు. అనేక వైమానిక దాడులు సమీపంలోని వ్యవసాయ భూములను తాకినట్లు వారు తెలిపారు. ఈ దాడులు రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు విస్తృతంగా నష్టం కలిగించాయని గాజా మేయర్ యాహ్యా సర్రాజ్ అల్-జజీరా టీవీకి చెప్పారు. దాడులు కొనసాగితే పరిస్థితులు మరింత దిగజారిపోతాయని అన్నారు.

యుద్ధం నేప‌థ్యంలో స్థానికంగా ఉన్న ఏకైక విద్యుత్ కేంద్రంలో ఇంధ‌న నిల్వ‌లు త‌గ్గిపోతున్నాయ‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి హెచ్చ‌రించింద‌ని స‌ర్రాజ్ తెలిపారు. గాజాలో ఇప్ప‌టికే 8-12 గంట‌ల మేర విద్యుత్ కోత‌ల‌ను విధిస్తున్నారు. న‌ల్లాల నుంచి వ‌చ్చే నీరు తాగేదిగా లేద‌ని తెలిపారు. స్థానిక విద్యుత్ అధికారి ఒక‌రు ఈ విష‌య‌మై మాట్లాడుతూ మ‌రో 2, 3 రోజుల వ‌ర‌కు గాజాకు విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు అవ‌స‌రం అయ్యే ఇంధ‌నం మాత్ర‌మే ఉంద‌న్నారు. వైమానిక దాడుల వ‌ల్ల అనేక స‌ర‌ఫ‌రా లైన్లు దెబ్బ తిన్నాయ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news