రేషన్ కార్డు కలిగిన వారికి బిగ్ రిలీఫ్…!

-

మీకు రేషన్ కార్డు వుందా…? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సమయంలో వారికి ఇబ్బందులు కలగకుండా ఉండడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

కోవిడ్ 19 కారణంగా రేషన్ సరులకు పంపిణీ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది కేంద్రం. అందుకే ఈ మహమ్మారి సమయం లో పలు చోట్ల రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ సరిగా జరగడం లేదని పలు నివేదికలు వెలువడ్డాయి. ఈ సంగతి కేంద్రం వద్దకు చేరింది. దీంతో మోదీ సర్కార్ వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది.

ఈ మేరకు సర్కార్ రేషన్ సరుకుల పంపిణీ విషయంలో రాష్ట్రాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రేషన్ పొందే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని అంది. అదే విధంగా ప్రతి రోజూ ఎక్కువ సేపు రేషన్ షాపులను తెరిచి ఉంచాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.

అలాగే నెలలో అన్ని రోజులు రేషన్ షాపులు ఓపెన్ చేసి ఉంచాలని కూడా అంది. రేషన్ కార్డు కలిగిన ఉంటే నెలలో ఎప్పుడైనా సరుకులు తీసుకోవడానికి వీలుంటుందని కేంద్రం చెప్పింది. దీంతో రేషన్ సరుకులు పొందే వారు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు.

అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఇది ఇలా ఉంటే మే, జూన్ నెలలో రేషన్ కార్డు కలిగిన వారు ఎక్కువ బియ్యం వస్తాయి. అలానే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కోటా కాకుండా కేంద్ర ప్రభుత్వ కోటా కూడా ఫ్రీ గానే లభిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news