సామాన్య ప్రజలకు మరో షాక్..ప్రతి నెలా పెరుగనున్న కరెంట్ ఛార్జీలు !

-

సామాన్య ప్రజలకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధం అయింది కేంద్ర సర్కార్‌. కేంద్రం తీరుతో ప్రతి నెలా కరెంట్ ఛార్జీలు పెరుగనున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే ఇంధనం చార్జీలు, విద్యుత్తు కొనుగోలు ధరలు పెరిగినప్పుడు ఆ మేరకు భారాన్ని ప్రతినెలా ఆటోమేటిక్ గా వినియోగదారుడుపై వేసేలా విద్యుత్తు కమిషన్ ఒక ఫార్ములా రూపొందించాలని కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా పేర్కొంది.

ఈ మేరకు విద్యుత్తు నిబంధనలు 2005ని సవరిస్తూ కొత్త నిబంధనలు జారీ చేసింది. భారాన్ని నెలవారిగా ఆటోమేటిక్ గా వినియోగదారుల టారిఫ్ కి మళ్ళించేలా విద్యుత్ కమిషన్ 90 రోజుల్లోపు ఒక ఫార్ములా రూపొందించాలని ఈ నిబంధనలో పేర్కొంది. ఆ నెలవారి ట్రూ ఆఫ్ ఛార్జీలను వార్షిక ప్రాతిపాదికన నిర్ధారించాలని స్పష్టం చేసింది. విద్యుత్ కమిషన్ ఈ కొత్త ఫార్ములా ఖరారు చేసేంతవరకు ఈ నిబంధనలో చెప్పిన విధానాన్ని అనుసరించాలని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news