తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని సైతం వదలని సైబర్ కేటుగాల్లు

-

సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి మరో అడుగు ముందుకు వేసి ఏకంగా రాష్ట్ర పోలీసు బాస్ పేరునే వాడేశారు. 9785743029 అనే ఫోన్ నెంబర్ ను ఉపయోగించి డీజీపీ మహేందర్ రెడ్డి ఫోటోను వాట్సాప్ డీపీ గా పెట్టి.. డబ్బులు అడిగినట్లు తెలుస్తోంది. సామాన్య ప్రజలు, పోలీసు సిబ్బంది, ఉద్యోగులు ఇలా చాలామందికి వాట్సాప్ లో టోకరా ఇచ్చిన కేటుగాళ్లు.. ఈ సారి ఏకంగా డీజీపీ మహేందర్ రెడ్డి ఫోటోతో ఉన్నా వాట్సప్ అకౌంట్ నుంచి డబ్బులు కావాలని మెసేజ్ లు రావడంతో పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు.

పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులు, సామాన్య ప్రజలకు కూడా డిజిపి పేరుతో మెసేజ్ లు వెళ్ళినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు మొదలు పెట్టింది. ఇలాంటి ఫేక్ రిక్వెస్ట్ లకు స్పందించవద్దని అలర్ట్ ఇష్యూ చేసింది. ఈ మెసేజ్ ల వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డీజీపీ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news