ఏ ఉద్యోగం లేకుండా అర్హత ఉన్నప్పటికీ ఖాళీగా ఉంటున్న నిరుద్యోగులు ఎందరో ఉన్నారు. అటువంటి వారు ఏ మార్గంలో అయినా ఉద్యోగం రావాలి అని ఆశిస్తుంటారు. అయితే ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకున్న కొందరు దొంగల ముఠా అభాగ్యులకు మోసం చేయాలి అని అనుకుంటారు. ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్రము హైద్రాబాద్ లో జరిగిన ఒక మోసాన్ని తాజాగా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ మరియు సైబర్ క్రైమ్స్, టాస్క్ ఫోర్స్ లు చేసిన ఒక గ్రూప్ ఆపరేషన్ 18 మంది టెలికాలర్స్ ను అదుపులోకి తీసుకున్నారు.
మొత్తం సంఘటన అంతా హైదరాబాద్ కేంద్రంగా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాగా వీరి మాటలకు మోసపోయిన వారిలో కర్ణాటక, కేరళ , తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారు ఉన్నారు. ఈ విషయంపై కాసేపటి క్రితమే పోలీసు బృందం ప్రెస్ మీటింగ్ ను ఏర్పాటు చేసారు.