జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో పాము కాటుకు గురైన ముగ్గురు విద్యార్థులు..!

-

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం వెనుక ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో శనివారం మధ్యాహ్నం మూత్ర విసర్జనకు వెళ్ళిన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురు పాము కాటుకు గురయ్యారు.జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ మెకానిక్ షాపులో పనిచేస్తున్న మైనర్ బాలుడు గోనుపాడు గ్రామానికి చెందిన అనిల్ కుమార్, కేటి దొడ్డి మండలం తూర్పు తాండాకు చెందిన సంతోష్ నాయక్, ఐజ మండలం తనగల గ్రామానికి చెందిన అర్జున్ కుమార్, గద్వాల కు చెందిన వీరేంద్ర చార్యులను చైల్డ్ ప్రొటెక్షన్, లేబర్ అధికారులు పట్టుకొని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో వదిలారు.

ఈ నలుగురు విద్యార్థులు శనివారం మూత్ర విసర్జనకు వెళ్లారు. అక్కడ పాముకాటు గురి కావడంతో హుటాహుటిన గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు క్షేమంగానే ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. మరో వైపు మెదక్‌ జిల్లా రామాయంపేటలోని గురుకుల హాస్టల్‌లో విద్యార్థినులను, మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో అల్లూరి సీతారామరాజు గురుకులంలోనూ   ఎలుకలు కరిచిన ఘటన తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news