ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. 4% డీఏ పెంపు

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్​ గుడ్​న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ఇచ్చే కరవు భత్యాన్ని 4 శాతం పెంచుతున్నట్లు తెలిపింది. ఫలితంగా 38 శాతం ఉన్న డీఏ 42 శాతానికి చేరుకుంది. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్​ సమావేశం​లో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో మొత్తం 47.58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. అదే విధంగా 69.76 లక్షల మంది పింఛన్​దారులకు లబ్ధి చేకూరనుంది.

కేంద్ర సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఖాజానాపై సంవత్సరానికి రూ.12,815 కోట్ల భారం పడనుందని కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్ తెలిపారు. ఈ పెంపును 2023 జనవరి 1 నుంచే అమలు పరచనున్నట్లు  వెల్లడించారు. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా.. డీఏను పెంచినట్లు పేర్కొన్నారు. అంతకుముందు గతేడాది సెప్టెంబర్​లో ప్రభుత్వం కరవు భత్యాన్ని పెంచిన విషయం తెలిసిందే. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు 4 శాతాన్ని పెంచింది. ఫలితంగా 34 శాతం ఉన్న డీఏ 38 శాతానికి చేరుకుంది. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news