యూట్యూబ్ ను షేక్ చేస్తున్న “దాక్కో దాక్కో మేక‌”…!

క్రేజీ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న సినిమా పుష్ఫ‌. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ష‌ర‌వేగంగా జ‌రుగుతోంది. గంద‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా నుండి అల్లు అర్జున్ లుక్ ను విడుద‌ల చేయ‌గా ఎంతో ఆకట్టుకుంటోంది. సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్ గా క‌నిపిస్తుండ‌ట‌తో బన్నీ లుక్ వైల్డ్ గా క‌నిపిస్తోంది. దాంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక సుక్కు బన్నీ కాంబోలో అప్పటికే ఆర్య, ఆర్య -2 సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ రెండు సినిమా లు మ్యూజికల్ హిట్స్ కాగా ఈ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. ఇక ఇప్పుడు పుష్ప సినిమా కు కూడా దేవిశ్రీ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ “దాక్కో దాక్కో మేక” ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సాంగ్ యుట్యూబ్ ను షేక్ చేస్తోంది. తాజాగా ఈ సాంగ్ 80 మిలియన్ మైలురాయిని బీట్ చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పంచుకుంది.