Ranga Marthanda: రూమర్స్‌ చెక్‌.. రంగమార్తాండ షూటింగ్ మ‌ళ్లీ మొదలైంది !

-

Ranga Marthanda: తెలుగు చిత్ర‌సీమ‌కు మురారి, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, చందమామ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ.. నక్షత్రం’ పరాజయం తర్వాత సుమారు రెండేళ్ల విరామానంతరం తీసుకుని డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్‌’ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

థియేటర్‌ ఆర్టిస్ట్‌లు పడుతున్న క‌ష్టాలు ఎలా ఉంటాయో తెలియజేసే విధంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. అయితే.. ఈ సినిమా .. ఏ ముహుర్తాన ప్రారంభించారో తెలియ‌దు కానీ.. ఈ చిత్రానికి సినిమా క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. షూటింగ్ ప్రారంభించి దాదాపు రెండేళ్లు గ‌డిచిన‌.. షూటింగ్ మాత్రం పూర్తికాలేదు. అనేక‌ రకాల కారణాలతో వాయిదా ప‌డుతుంది. దీంతో ఈ సినిమా నుంచి నిర్మాత తప్పుకున్నారని గతంలో పుకార్లు షికార్లు చేశాయి.

కానీ .. వీటిని తిప్పికొడుతూ.. షూటింగ్ ప్రారంభించింది చిత్ర యూనిట్. కానీ, కరోనా కార‌ణంగా సినిమా షూటింగ్ మరోసారి వాయిదా పడింది. సెకండ్‌ వేవ్‌ తర్వాత పరిస్థితులు మళ్లీ మాములు స్థితికి వచ్చినా
రంగమార్తాండ షూటింగ్ ప్రారంభించ‌క‌పోయే స‌రికి.. ఈ చిత్రం ఆగిపోయింది అంటూ మ‌రో సారి పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ ఓ ట్వీట్‌తో వాటన్నింటికీ చెక్ ప‌డేలా చేశాడు.

సినిమా షూటింగ్‌ ఎట్టకేలకు మళ్లీ మొదలైంది అంటూ షూటింగ్‌ స్పాట్‌కు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ ఫొటో లో శివాత్మిక క‌నిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాశ్‌ రాజ్‌ కీలకపాత్రలో న‌టించ‌నున్నారు. బ్రహ్మానందం, రాహుల్‌ సిప్లిగంజ్‌, శివాత్మిక..తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. కాగా.. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news