మహా సిఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తన మొదటి దసరా ప్రసంగం చేశారు. శివసేన వార్షిక ‘విజయదశమి మేళా’ సందర్భంగా స్వాత్రా వీర్ సావర్కర్ ఆడిటోరియంలో ప్రసంగించారు ఆయన. ఈ సందర్భంగా గవర్నర్ పై విమర్శలు చేసారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని ‘కాళి టోపి’ (బ్లాక్ టోపీ) ధరించిన వ్యక్తని ఎద్దేవా చేసారు.
‘హిందుత్వ’ అంటే దేవాలయాలలో పూజలు చేయడం అని కాదన్నారు. బిజెపిని ఉద్దేశించి… వారు ప్రభుత్వాన్ని పడగొడతారని చాలా మంది చెప్తున్నారని… ఇప్పటికీ ప్రజలు అదే చెబుతున్నారని… నేను అందరికి ధైర్యం చెప్పాలని భావిస్తున్నా అని… మీకు ధైర్యం ఉంటే నా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేయండి అని ఆయన సవాల్ చేసారు. శివసేన మాజీ ఎన్డీఏ మిత్రపక్షమైన బిజెపిని లక్ష్యంగా చేసుకుని… “గొడ్డు మాంసం నిషేధం మహారాష్ట్రలో ఎందుకు…? గోవాలో ఎందుకు లేదు? వీళ్ళు నాకు హిందుత్వ నేర్పుతున్నారు” అని మండిపడ్డారు.