బాలా త్రిపుర సుంద‌రిగా ద‌ర్శ‌న‌మిచ్చిన అమ్మ‌వారు

412

Dasara festival begin at Vijayawada Kanaka Durga Temple
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు రెండో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం కనకదుర్గ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భ‌క్తుల‌కు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. లలితా త్రిపుర సుందరిదేవి రూపంలో అమ్మవారు 3 సంవత్సరాల బాలికా రూపంలో కనిపిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవటం ద్వారా అనుకున్న పనులు నెరవేరతాయని భక్తుల నమ్మకం.

ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు గంటల తరబడి వేచి చూస్తున్నారు. తొలిరోజు 80వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మొదటి రోజుతో పోలిస్తే ఈరోజు భక్తుల రద్దీ తక్కువగా ఉంది. దసరా ఉత్సవాల కోసం ప్రత్యేకంగా కేరళ నుంచి తెప్పించిన కళాకారుల డప్పు వాయిద్యాలు దుర్గమ్మ ఆలయంలో ప్రతిధ్వనిస్తున్నాయి. అమ్మవారి భక్తుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.