ఇల్లు, పార్టీ ఆఫీసు నిర్మాణాల‌ను ప‌రిశీలించిన ప‌వ‌న్‌

-

pawan kalyan visits his new residency kaja village
అమ‌రావ‌తి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ వద్ద నిర్మిస్తున్న తన నివాస, పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేయబోతున్న జనసేన పార్టీ కార్యాలయ ఆవరణలో నాటేందుకు అవసరమైన మొక్కలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ నుంచి విలువైన మొక్కలను లారీలో ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ మొక్కలను పరిశీలించిన పవన్‌… వాటి ప్రత్యేకతలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క మొక్క వద్ద పవన్‌ ఐదు నిమిషాల పాటు గడిపారు.

Read more RELATED
Recommended to you

Latest news