వివేకా హత్య కేసులో కీలక పరిణామం… సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్

-

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన మాజీ డ్రైవర్ దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వివేకా హత్య కేసులో తనను నిందితుడిగా తొలగించాలని తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశాడు. కేవలం సాక్షిగా మాత్రమే పరిగణించాలని కోరాడు. గతంలో సీబీఐ చార్జిషీట్ లో తనను సాక్షిగా చేర్చిందని దస్తగిరి వివరించాడు. దస్తగిరి పిటిషన్ ను నాంపల్లి సీబీఐ కోర్టు రేపు విచారించనుంది. వివేకా హత్య కేసులో దస్తగిరి ఏ-4గా ఉన్నాడు. అయితే అప్రూవర్ గా మారిన అనంతరం అతడికి బెయిల్ లభించింది.

Dastagiri Openly Claims Threat From Jagan & Avinash

జులై నెలలో ,2019 మార్చి 15 తెల్లవారుజామున లోటస్‌పాండ్‌లో జగన్‌తో సమావేశంలో ఉన్నప్పుడు ఆయన అటెండర్‌ నవీన్‌ వచ్చి ఎంపి అవినాష్‌ ఫోన్‌ లైన్‌లో ఉన్నారని, బయటకు రావాలని పిలిచారు. వివేకా మరణించారని అవినాష్‌ నాకు ఫోన్‌లో చెప్పారు. ఎలా జరిగిందని అవినాష్‌రెడ్డిని అడిగాను. బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్నారని చెప్పారు. జగన్‌కు సమాచారం ఇవ్వండని అవినాష్‌ చెప్పారు. వివేకా మరణం విషయం, అవినాష్‌ చెప్పిన సమాచారం జగన్‌కు చెప్పాను. తర్వాత జగన్‌ పులివెందుల వెళ్లారు. జగన్‌ పర్యటన విషయం మాట్లాడేందుకు ఆ సమయంలో అవినాష్‌కు ఐదుసార్లు ఫోన్‌ చేశాను’ అని కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. రాజకీయ కారణాలతోనే బాబాయ్ హత్య జరిగింది. హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కారణాలు కాదు. పెద్ద కారణం ఉంది. అవినాష్‌ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడడమే కారణం కావొచ్చు. వారికి అడ్డొస్తున్నారని మనసు లో పెట్టుకోవచ్చు. హత్యకు కొన్ని నెలల ముందు బెంగళూరులోని మా ఇంటికి వివేకా వచ్చారు.

 

కడప ఎంపిగా పోటీ చేయాలని ఆయన నన్ను అడిగారు. ఎంపిగా అవినాష్‌ పోటీ చేయొద్దని కోరుకుంటున్నట్లు చెప్పారు. అవినాష్‌కు టికెట్‌ ఇవ్వకుండా ఎలాగైనా జగన్‌ను ఒప్పిద్దామన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా నేను వెళ్లనని వివేకా ఆలోచిం చారు. కచ్చితంగా ఒప్పించగలననే ధీమాతో ఆయన మాట్లాడారు. జగన్‌ నాకు మద్దతివ్వరని తెలుసు కాబట్టి ఎంపిగా పోటీకి మొదట ఒప్పుకోలేదు. బాబారు పదేపదే ఒత్తిడి చేయడంతో సరే అన్నాను. ఎమ్మెల్సీగా బాబారు ఓటమికి అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, కొందరు సన్నిహితులే కారణం. కుటుంబంలో అంతా బాగున్నట్లు బయటకు కనిపించినా, లోపల కోల్డ్‌వార్‌ ఉండేది అని అప్పుడు షర్మిల పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news