“అలయ్ బలయ్” కి ఆహ్వానాలు పంపారు బండారు దత్తాత్రేయ. విజయదశమి సందర్బంగా అందరు కలుసుకొని ఆత్మీయంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొనే కార్యక్రమమే ఈ అలయ్ బలయ్. బండారు దత్తాత్రేయ గారు తెలంగాణ ఉద్యమ నేపథ్యం లో తెలంగాణ సమాజంలో అనేక వైరుధ్యాల భిన్న అభిప్రాయాలూ కలిగిన వారిని ఏకం చేసే కార్యక్రమంగా దీన్ని ప్రారంభించిన సంగతి అందరికి విదితమే. తెలంగాణ ఉద్యమ సమయం లో అలయ్ బలయ్ కార్యక్రమం ఉద్యమానికి ఊపునిచ్చింది. ఉద్యమకారులందరికి ఒక వేదికనిచ్చింది. యువతకు మనోదైర్యాన్నిచింది. సకలజనులకు ఒక భరోసానిచ్చి, రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించింది.
ఏడాది మొత్తం రాజకీయాల్లో ఎంతో బిజిగా ఉన్న వివిధ పార్టీల నేతలను కార్యకర్తలను పార్టీల బేదాభిప్రాయాలు పక్కన పెట్టి ఆత్మీయంగా కలుసుకొని ఉల్లాసంగా గడిపే ఒకమంచి సంప్రదాయానికి ప్రతీక ఈ అలయ్ బలయ్. గౌరవ శ్రీ దత్తాత్రేయ గారు ఈ అలయ్ బలయ్ ని ఒక ఉద్యమ దీక్షుచిగా , రాష్ట్ర సాధనకు సాధనంగా వినియోగిస్తూనే అన్ని పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి నాంది పలికారు. గత 17 ఏండ్లనుండి తెలంగాణ ఆనవాయితీగా, సంప్రదాయచిహ్నంగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఈ సంవత్సరం మరింత వైభవంగా నిర్వహించాలని భావిస్తున్నామని నిర్వహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖులు :
శ్రీమతి తమిళశై సౌందర్య రాజన్ – తెలంగాణ గవర్నర్
శ్రీ బిశ్వభూషణ్ హరిచందన – ఆంధ్రప్రదేశ్ గవర్నర్
శ్రీ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ – కేరళ గవర్నర్
శ్రీ బండారు దత్తాత్రేయ – హర్యానా గవర్నర్
శ్రీ మనోహర్లాల్ ఖట్టర్ – హర్యానా ముఖ్యమంత్రి
శ్రీ భగవంత్ మం సింగ్ – పంజాబ్ ముఖమంత్రి.
శ్రీమతి నిర్మల సీతారామన్ – కేంద్ర ఆర్థిక శాఖామంత్రి
శ్రీ భూపేంద్ర యాదవ్ – కేంద్ర కార్మిక శాఖామంత్రి
శ్రీ జి కిషన్ రెడ్డి – కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
శ్రీ భగవంత్ ఖుబా – కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి
శ్రీ మహమ్మద్ అలీ – హోమ్ శాఖ మంత్రి
తలసాని శ్రీనివాస్ యాదవ్, బండి సంజయ్ , రేవంత్ రెడ్డి , ఈటెల రాజేందర్ కోదండరాం ఇతర రాష్ట్ర ప్రముఖులు