గుణపాఠాలు చెబుతున్న డేవిడ్ వార్నర్.. అభిమానులకి పండగే..

-

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ కి ఆడుతున్నప్పటి నుండి తెలుగు వారికి చాలా దగ్గరయ్యాడు. ఆటలో ఒంటిచేత్తో గెలిపిస్తూ సన్ రైజర్స్ టీమ్ ని విజయతీరాలకి చేర్చడమే కాకుండా, ఆట ముగిసిన తర్వాత తనదైన టిక్ టాక్ వీడియోలతో అలరిస్తూ ఉంటాడు. బుట్టబొమ్మ సాంగ్ మొదలుకుని పోకిరిలో డైలాగ్ వరకూ వార్నర్ చేసిన వీడియోలకి చాలా మంది అభిమానులు ఉన్నారు. తాజాగా డేవిడ్ వార్నర్ చేసిన వీడియోకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య టీజర్ రిలీజై ట్రెండింగ్ లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. అందులో గుణపాఠాలు అన్న డైలాగ్ అందరికీ చేరింది. ఇప్పుడు ఆ డైలాగ్ తో డేవిడ్ వార్నర్ చేసిన వీడియో క్రేజీగా ఉంది. రీఫేస్ యాప్ ద్వారా చేసిన ఈ వీడియో తెలుగు ప్రేక్షకులని బాగా అలరిస్తుంది. తెలుగు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న డేవిడ్ వార్నర్, ఎప్పుడో అప్పుడు తెలుగు సినిమాల్లో కనిపించేలా ఉన్నాడు.

https://www.instagram.com/p/CKs1qnGFxu9/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news