ఐపీఎల్ లో ఒ ఫ్రాంచైజీపై వెయ్యికి పైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అనంతరం.. ఈ ఘనట సాధించింది వార్నర్ మాత్రమే. బుధవారం పంజాబ్ తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు పై 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు డేవిడ్ వార్నర్.
కాగా..పంజాబ్ కింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఓపెనర్లు దమ్ములేపారు. 116 పరుగుల టార్గెట్ ను ఛేధించడానికి ఆకాశమే హద్దుగా చేలరేగారు. 10.3 ఓవర్లలోనే టార్గెట్ ను ఫినిష్ చేశాడు. ప్రథ్వీ షా(20 బంతుల్లో 41) 7 ఫోర్లు, 1 సిక్స్ తో రాణించాడు. అలాగే డేవిడ్ వార్నర్ ( 30 బంతుల్లో 60 నాటౌట్) 10 ఫోర్లు, 1 సిక్స్ తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు తొలి వికెట్ కు 83 పరుగులు జోడీంచారు. తర్వాత సర్పరాజ్ ఖాన్ (12 నాటౌట్ ) గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆలౌ రౌండర్ ప్రదర్శనతో ఘన విజయం సాధించింది.