మాస్టర్ పీస్ KGF2..ప్రశాంత్ నీల్, యశ్‌లపై సూపర్ స్టార్ ప్రశంసల వర్షం

-

ప్రశాంత్ నీల్ – యశ్ కాంబోలో తెరకెక్కిన KGF2 పిక్చర్ ఈ నెల 14న విడుదలై రికార్డులన్నిటినీ తిరగరాస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. సామన్యులు, సినీ అభిమానులు, సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసి తన స్పందన తెలిపారు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర.

KGF2 మాస్టర్ పీస్ అని, ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవల్ డైరెక్టర్ అని చెప్పారు ఉపేంద్ర. స్క్రిప్ట్, డైలాగ్స్, మ్యూజిక్ , ఆర్ట్ , ప్రొడక్షన్ ఇలా అన్ని ఈ సినిమాకు కుదిరాయని, యశ్ బంగారమని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు ఉపేంద్ర. శాండల్ వుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ఉపేంద్ర ఇంత మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వడం పట్ల కేజీఎఫ్ మూవీ యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు.

KGF2 రికార్డుల వేట కొనసాగుతోంది. బాలీవుడ్ రికార్డులన్నిటినీ ఇప్పటికే దాటేసిన ఈ పిక్చర్ అతి త్వరలో రూ.1,000 కోట్ల క్లబ్ లోకి డెఫినెట్ గా వెళ్తుందని సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాను కేవలం శాండల్ వుడ్ సినిమాగా కాకుండా తమ సినిమాగా దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆదరిస్తున్నారు. చాప్టర్ 1 ను మించి చాప్టర్ 2 ఉండటం పట్ల సినీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. చాప్టర్ 3 కూడా తీయాలని ఈ సందర్భంగా కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news