Proposal Day Special : ఇలా ప్రపోజ్ చేస్తే.. మీరు ప్రేమించే వాళ్లు ఫిదా అవ్వడం ఖాయం

-

ప్రేమ.. రెండక్షరాల పదం.. రెండు జీవితాల బంధం. మాట నేర్చినప్పటి నుంచి కాటికి వెళ్లేవరకు ప్రతి ఒక్కరు తమ లైఫ్​లో ఎప్పుడో ఒకప్పుడు.. ఎక్కడో చోట ప్రేమలో పడతారు. పలకడానికి రెండక్షరాలే.. ఉండేది ఇద్దరు మనుషుల మధ్యే.. కానీ దీని పరిధి జగమంత. ప్రేమకు ఓ సరైన డెఫినేషన్ లేదు. ప్రేమను కొలవగలిగే సాధనం లేదు. ప్రేమంటే ఏంటి అంటే చెప్పలేం.. ఏదీ అంటే చూపించలేము.. ఎంత అంటే వివరించలేం.

అయితే ప్రేమ అందరికీ దక్కాలని రూల్ లేదు. కొందరి ప్రేమ కడదాక ఉంటే.. మరికొందరికి మొదలయ్యేలోపే ముగిసిపోతుంది. ఇంకొందరి ప్రేమ వన్ సైడ్ స్టోరీలా ఆ భగ్నప్రేమికుల గుండెల్లోనే నిలిచిపోతుంది. అయితే ప్రేమ సక్సెస్ అవ్వాలంటే ముందు కావాల్సింది.. ఆ ప్రేమను వ్యక్తపరచడం. గుండెల నిండా ప్రేమ ఉన్నా.. గొంతులో ధ్వనించకపోతే.. అది ఎదుటి వారిని చేరకపోతే వృధాయే.

అందరూ ప్రేమలో పడతారు.. తమ కంటే ఎక్కువగా తాము ప్రేమించిన వాళ్ల కోసం తాపత్రయపడతారు. వారి కోసం ఏదైనా చేస్తారు. కానీ ఆ ప్రేమను తిరిగి పొందాలంటే.. ముందు మీ ప్రేమ సంగతి మీరు ప్రేమించే వాళ్లకి తెలియాలి. అందుకే ప్రేమించడం కన్నా.. ప్రేమను వ్యక్తపరచడం ముఖ్యం. అదేనండి ప్రపోజ్ చేయడం.

ప్రేమను వ్యక్తపరచలేక ఎంతో మంది తమలో తామే కుమిలిపోయిన వాళ్లున్నారు. తాము ప్రేమిస్తున్నామని చెబితే.. అప్పటివరకు తమ మధ్య ఉన్న స్నేహబంధం పాడైపోతుందేమోనని భయపడి వెనకడుగేసిన వాళ్లున్నారు. కొన్నిసార్లు సరిగ్గా వ్యక్తపరచలేక ప్రేమను కోల్పోయిన వారు కోకొల్లలు. అందుకే లవ్ ప్రపోజల్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ వాలెంటైన్ వీక్​లో ఇవాళ లవ్ ప్రపోజల్ డే. మరి మీరు ప్రేమించిన వాళ్లకి ఈరోజు మీ ప్రేమను తెలియజేస్తున్నారా..? ఒకవేల ప్రపోజ్ చేయాలనుకుంటే ఎలా చేస్తున్నారు..?

నీ పార్ట్​నర్​ను నువ్వెంత ప్రేమిస్తున్నావో నీకు తెలిస్తే సరిపోదు. వాళ్లకీ తెలియాలి. వాళ్లపై మీకు ఎంత ప్రేముందో వారికి అర్థం కావాలి. అలాగనే.. నువ్వులేకపోతే నేను బతకలేనంటూ భారీ భారీ డైలాగులు చెప్పకూడదు. మీకు వారిపై ఎంత ప్రేముందో మీరు చేసే పనులను బట్టి.. మీ ప్రవర్తనను బట్టి వాళ్లకి అర్థమవ్వాలి. అప్పుడే జీవితాంతం మీ తోడుంటే బతకేస్తామనే నమ్మకం మీ పార్ట్​నర్​లో కలిగి మీ వేలుపట్టి నడిచేస్తారు.

మీ ప్రేమను వ్యక్తపరచకుండా మీలో మీరే కుమిలిపోతూ.. మీ గుండెల్లో నాగార్జున సిమెంట్​తో తాజ్​మహల్​ కట్టినా.. రక్తాలొచ్చేలా చేతులు కోసుకున్నా.. ఒరిగేదేం ఉండదు. ఇద్దరి మధ్య ప్రేమ నిలవాలంటే దాన్ని సరైన సమయంలో సరిగ్గా వ్యక్తపరచడం ముఖ్యం.

సో అమ్మాయిలూ.. అబ్బాయిలూ.. ఇవాళ ప్రపోజల్ డే.. సూపర్​గా రెడీ అయి మీరు ప్రేమిస్తున్న వాళ్లకు ఓ రోజ్ ఇచ్చి.. వారి కళ్లలోకి సూటిగా చూస్తూ.. హ్యాపీగా మీ మనసులో ఉన్న మాట చెప్పేయండి. నిజాయతీగా వ్యక్తపరిచే ప్రేమ వాళ్ల గుండెల్ని తాకుతుంది. మీ ప్రపోజల్ వారి హృదయాంతరాల్లో మీపై ఉన్న ప్రేమ ద్వారాన్ని తెరుస్తుంది. సో అమ్మాయిలూ.. అబ్బాయీలూ.. మీ లవ్ ప్రపోజల్​కు ఆల్ ది బెస్ట్.

Read more RELATED
Recommended to you

Latest news