టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

-

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ 14వ ఢిల్లీ క్యాపిట‌ల్స్ గుజ‌రాత్ జెయింట్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మేగ్ లానింగ్ ఫీల్డింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తారా నోరిస్ ప్లేస్‌లో పూన‌మ్ యాద‌వ్‌ను ఆడిస్తోంది. అశ్విని కుమారి, లారా వోల్వార్డ్త్‌ల‌ను గుజ‌రాత్ తుది జ‌ట్టులోకి తీసుకుంది. ఈ టోర్న‌మెంట్‌లో నాలుగు విజ‌యాల‌తో రెండో స్థానంలో ఉన్న ప‌టిష్ట‌మైన ఢిల్లీని గుజ‌రాత్ నిలువ‌రిస్తుందా? అనేది ఆస‌క్తిక‌రం. గుజ‌రాత్ ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క మ్యాచ్ మాత్ర‌మే గెలిచింది. అది కూడా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపైన‌. దాంతో, ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ పోటీలో నిల‌వాల‌ని స్నేహ్ రానా సేన భావిస్తోంది.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు : మేగ్ లానింగ్ (కెప్టెన్), ష‌ఫాలీ వ‌ర్మ‌, మ‌రిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిసే క్యాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీప‌ర్), అరుంధ‌తి రెడ్డి, శిఖా పాండే, పూన‌మ్ యాద‌వ్. రాధా యాద‌వ్.

గుజ‌రాత్ జెయింట్స్ జ‌ట్టు : లారా వోల్వార్డ్త్‌, సోఫీ డంక్లే, స్నేహ్ రానా (కెప్టెన్), హ‌ర్లీన్ డియోల్, అష్ గార్డ్‌న‌ర్, ద‌య‌లాన్ హేమ‌ల‌త‌, అశ్విని కుమారి, సుష్మా వ‌ర్మ (వికెట్ కీప‌ర్), కిమ్ గార్త్, త‌నుజా క‌న్వ‌ర్, మ‌న్సీ జోషి.

 

Read more RELATED
Recommended to you

Latest news