బ్రేకింగ్ : స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కి డీసీజీఐ అనుమతి 

-

ప్రస్తుతం దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోన్న ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్ మాత్రమే వ్యాక్సినేషన్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ రెండూ దేశీయంగా ఏర్పడిన డిమాండ్‌ తీర్చేలా కనిపించకపోవడంతో నిన్న మూడో వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చారు.

తాజాగా కొద్ది సేపటి క్రితం అత్యవసర పరిస్థితుల మధ్య ఈ వ్యాక్సిన్‌ను వినియోగించ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్‌లో అత్యవసర పరిస్థితుల్లో తమ వ్యాక్సిన్‌ను వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ఇదివరకే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీ సంస్థ దాఖలు చేసిన దరఖాస్తులపై సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) ఆమోద ముద్ర తెలిపిన కొన్ని గంటల వ్యవధిలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను దేశీయంగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ తయారు చేస్తోంది. దీనికోసం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  

Read more RELATED
Recommended to you

Latest news