మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఒక పరుపుల కంపెనీలో దూది స్థానంలో వాడిన మాస్కులు ఉపయోగించినందుకు గాను పోలీసులు ఒక పరుపుల తయారీ కర్మాగారాన్ని సీజ్ చేశారు. ఆ కంపెనీ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారు ప్రాంగణంలో వాడేసిన మాస్కులని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. రాజధాని ముంబైకి ఈశాన్యంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్గావ్‌లోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఐడిసి) లోని పోలీస్ స్టేషన్‌లోని అధికారులకు ఈ అంశం మీద సమాచారం అందింది.
“ఎంఐడిసి కుసుంబ గ్రామంలోని కర్మాగార ప్రాంగణాన్ని సందర్శించినప్పుడు, ఉపయోగించిన మాస్క్ లతో ఒక పరుపు సిద్దం చేసినట్లు కనుగొన్నారు. “ఫ్యాక్టరీ యజమాని అమ్జాద్ అహ్మద్ మన్సూరిపై కేసు నమోదైంది. పోలీసులు ఇతరుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రాంగణం వద్ద ఉన్న వాడిన మాస్కులుకు నిప్పంటించారు.