భవదీయుడు భగత్ సింగ్.. చిత్రాన్ని చిరంజీవితో చేయబోతున్నారా..?

-

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రేజ్ వల్లే ప్రస్తుతం రాజకీయాలలో కూడా తన హవా కొనసాగించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తను తెరకెక్కించాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. అలా డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కించాల్సిన భవదీయుడు భగత్ సింగ్ చిత్రం ఆగిపోయినట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యలో డైరెక్టర్ హరీష్ శంకర్ కలుగజేసుకొని అలాంటిదేమీ లేదని సమయం వచ్చినప్పుడు ఈ చిత్రం అప్ డేట్ ని ప్రకటిస్తానని క్లారిటీ ఇవ్వడం జరిగింది.

అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల వల్ల పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడం చేత ఈ సినిమాపై మరింత అనుమానాలు అభిమానులలో వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ బ్రేక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు. దీంతో సెట్స్ పైన ఉన్న హరిహర వీరమల్లు చిత్రం కూడా పూర్తి కావడం కూడా చాలా కష్టంగానే ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ తో చేయవలసిన భవదీయుడు భగత్ సింగ్ సినిమాని పవన్ కళ్యాణ్ వద్దనుకున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రాన్ని చిరంజీవితో చేయాలని హరీష్ శంకర్ ను మెగా అభిమానులు కోరుకుంటూ ఉండడం గమనార్హం. అందుకోసం మెగా అభిమానులు సైతం డైరెక్టర్కు పలు రిక్వెస్ట్ లు కూడా పెడుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవికి ఈ టైటిల్ తో ఇలాంటి సినిమా చేయాలని చాలా కోరికగా ఉన్నది.. అందుకోసం చిరంజీవికి తగ్గట్టుగా కథను మార్చి చిరంజీవితో సినిమా తీయాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు. మరి చిరంజీవితో హరీష్ శంకర్ కి లైన్ క్లియర్ అవుతుందేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news