వెరైటీగా ‘మది’ సినిమా ప్రమోషన్స్‌.. రోడ్లపై రచ్చ..

-

నాగ ధనుష్‌ దర్శకత్వంలో శ్రీరామ్‌ నిమ్మల హీరోగా రిచాజోషి హీరోయినగా నటించిన సినిమా మది. ఈ లేటెస్ట్‌ మూవీకి పీవీఆర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి.. చేసుకుని రిలీజ్‌ కు రెడీ అయింది. ప్రగతి పిక్చర్స్‌ బ్యానర్స్‌ పై రామ్‌ కిషన్‌ నిర్మిస్తున్న సినిమా ఇది. ఆర్వీ సినిమాస్‌ సహ నిర్మాతలుగా, ఆర్వీ రెడ్డి సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ను వినూత్నంగా చేస్తున్నారు హీరో, హీరోయిన్లు. ఫన్‌ పటాకా ప్రాంక్‌స్టార్‌ కిరణ్‌తో కలిసి హీరో శ్రీరామ్‌, హీరోయిన్‌ రిచాజోషి లు రోడ్డుపై జనాను ప్రాంక్‌ చేస్తూ తమ సినిమా ప్రమోషన్లు చేశారు. ప్రాంక్‌ చివరాకరకు మది సినిమా టిక్కెట్లు పంచుతూ తమ సినిమాను చూడాలంటూ కోరుతున్నారు. అయితే.. ఇటీవల ఓరి దేవుడా సినిమాకు సైతం విశ్వక్‌సేన్‌ ప్రాంక్‌స్టార్‌ కిరణ్‌తో ప్రాంక్‌ చేసిన విషయం తెలిసిందే.

Madhi Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos |  eTimes

రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా రాబోతోంది. ఈ తరం యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా, వినూత్న రీతిలో కథనం
సాగనుంది. ఈ సినిమాలో ఐదు సాంగ్స్‌ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించనుందని నిర్మాత రామ్‌ కిషన్‌, సహా నిర్మాత శ్రీనివాస్‌ రామిరెడ్డి ప్రకటించారు. ఈ సినిమాలో రామ్‌ కిషన్‌, శ్రీకాంత్‌, బైరోజ్‌, స్నేహ మాధురి శర్మ, యోగి కత్రి, శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా రేపు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news