న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 45,015 కరోనా కేసులు నమోదు కాగా 3,998 మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి 36,977 మంది కోలుకున్నారు. ఇంకా 4 లక్షల 7 వేల 170 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకూ 41 కోట్ల 54 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 3 కోట్ల 12 లక్షల 16 వేల 337 మందికి కరోనా సోకింది.
ఇప్పటివరకూ 4 లక్షల 18 వేల 480 మంది చనిపోయారు. ఇప్పటివరకూ 3 కోట్ల 3 వేల మంది కరోనా చికిత్స పొంది కోలుకున్నారని కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు. భౌతిక దూరం తప్పని సరిగా పాటించాలని పిలుపు నిచ్చారు. అత్యవసరాల్లో మాత్రమే ఇళ్ల నుంచి రావాలని సూచించారు. ఇమ్యూనిటీ పెంచే పదార్థాలు తీసుకోవాలని తెలిపారు. శారీరక, మానసిక ఫిట్ నెస్ కోసం యోగా వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పారు.