డిసెంబర్‌ 27 ఆదివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

డిసెంబర్ – 27 – మార్గశిర మాసం – ఆదివారం.

 

మేష రాశి:ఈరోజు మిశ్రమ ఫలితాలు !

ఈరోజు మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు ధన యోగం కలుగుతుంది. ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈరోజు అంతా మంచే జరుగుతుంది. ఈరోజు తల్లిదండ్రుల మాటలను వినడం చాలా మంచిది. ఈరోజు గృహ నిర్మాణం చేసే అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి.

పరిహారాలుః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి అంతా బాగుంటుంది.

 

todays horoscope

వృషభ రాశి:ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు !

ఈరోజంతా చాలా బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఇంతకుముందు పోగొట్టుకున్న డబ్బుని, గౌరవాన్ని ఈరోజు పొందుతారు. ఈరోజు ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభం కలుగుతుంది. పోటీపరీక్షలలో విద్యార్థులు విజయం సాధింస్తారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణ చేసుకోండి.

 

మిధున రాశి:ఈరోజు రాబడి తక్కువగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఖర్చు ఎక్కువగా రాబడి తక్కువగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఎవరితో వాదోపవాదాలు పెట్టుకోకండి. ఈరోజు తల్లిదండ్రుల మాటలను వినడం చాలా మంచిది లేదంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టడం మంచిది, అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. ఈరోజు విలువైన పత్రాల మీద అనవసరంగా సంతకాలు చేయకండి ఇబ్బంది పడతారు.

పరిహారాలుః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి అంతా బాగుంటుంది.

 

కర్కాటక రాశి:విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు !

ఈరోజు అంతా బాగుంటుంది. విద్యార్థులు చదువుమీద దృష్టిని కేంద్రీకరిస్తారు. ఈరోజు అన్నదమ్ములు కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ధన లాభం కలుగుతుంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారం లో అభివృద్ధి చేందుతారు. ఇంతకుముందు పోగొట్టుకున్న డబ్బులు ఈరోజు అందుకుంటారు.

పరిహారాలుః ఈరోజు లక్ష్మి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

  సింహరాశి:ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు !

ఈరోజు రాజ యోగం కలుగుతుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ధనప్రాప్తి కలుగుతుంది. ఈరోజు స్నేహితులతో, బంధువులతో సహాయ సహకారాలను అందుకుంటారు. ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు కలుగుతాయి. సమయానికి నిద్ర ఆహారాలను పాటిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజంతా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధిస్తారు.

పరిహారాలుః ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని  పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:ఈరోజు కష్టాలన్నీ అధిగమిస్తారు !

ఈరోజు కొంచెం బాగుంటుంది. ఈరోజు కష్టాలన్నీ అధిగమిస్తారు. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకుంటారు. ఈరోజు ధన లాభం కలుగుతుంది. ఈరోజు మీ పెద్ద వారి మాటలను, సూచనలను పాటించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు అనవసరపు వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకుండా ఉండటం మంచిది. ఈరోజు  కార్యాలయంలో మీరు కష్టమైన సమస్యను పరిష్కరించు కోగలుగుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి .

 

 తులారాశి:ఈరోజు వ్యాపారంలో నష్టం !

ఈరోజంతా జాగ్రత్తగా ఉండటం మంచిది. విద్యార్థులు చదువు మీద బాగా శ్రద్ధ పెట్టి చదువుకుంటే బాగుంటుంది. ఈరోజు అనవసరపు పరిచయాలను పెంచుకోకుండా ఉండడం మంచిది. ఈరోజంతా కుటుంబంతో గడపడం వల్ల శుభం కలుగుతుంది. ఈరోజంతా పెద్దవారి సూచనలను పాటించడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో కొద్దిపాటి నష్టం కలిగే అవకాశం ఉంది.

పరిహారాలుః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి .

 

వృశ్చిక రాశి:ఈరోజు పోటీపరీక్షల్లో రాణిస్తారు !

ఈరోజు అంతా బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో రాణిస్తారు. ఈరోజు ఉద్యోగ లాభం కలుగుతుంది. ఈరోజు కుటుంబ అందరితో కలిసి మెలిసి సఖ్యతగా ఉంటారు. ఈరోజు సంతోషంగా ఉంటారు. ఈరోజు సమయానికి నిద్ర ఆహారాలను పాటిస్తారు. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు మీ చేతి నిండా డబ్బు ఉంటుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో ధనప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఈరోజు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకం.

పరిహారాలుః ఈరోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

 ధనస్సు రాశి:ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు !

ఈరోజంతా బాగుంటుంది. విలువైన బహుమానాలను అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఈరోజు ధన యోగం కలుగుతుంది. ఈరోజు వ్యాపారం లో లాభాలు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఈరోజు మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు అందరితో సఖ్యతగా సంతోషంగా ఉంటారు. ఈరోజు సోదరులతో కలిసి మెలిసి ఉంటారు. ఈరోజు అభరణాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు విద్యార్థులు చదువు మీద బాగా శ్రద్ధ పెట్టి చదువుకుంటారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు.

పరిహారాలుః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

 

 మకర రాశి:వ్యాపారం లో స్వల్ప లాభాలు కలుగుతాయి !

ఈరోజు మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు బ్రాహ్మణులకు తోటకూర గోధుమలు దానం చేసుకోవడం గోధుమలు దానం చేసుకోవడం మంచిది. ఈరోజు ఆర్థిక లాభం కలుగుతుంది. ఈరోజు మధ్యవర్తులను నమ్మకుండా ఉండడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో స్వల్ప లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం, విఘ్నేశ్వర  స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి:వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ పని లో నైనా కంగారు తగ్గించుకుంటే మంచిది. ఈరోజు ఎదుటి వారిని గౌరవించడం మంచిది. ఎవరిని అనవసరంగా నిందారోపణ చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈరోజు అన్నదమ్ములతో కలిసిమెలిసి ఉండడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్లనించి తప్పిస్తుంది. విద్యార్థులు అధిక శ్రమ పడి చదువుకోవడం వలన ప్రయోజనం పొందుతారు. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు.

పరిహారాలుః ఈరోజు దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:తీర్థయాత్రలు చేస్తారు !

ఈరోజు అంతా బాగుంటుంది. ఈరోజు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. ఈరోజు శుభకార్యాన్ని జరిపే సఅవకాశం ఉంది. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ఇంతకు ముందు పోయిన వస్తువులను ఈరోజు పొందుతారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లో అభివృద్ధి కలుగుతుంది. ప్రయాణాలు బాగా కలిసి వచ్చిన రోజు. ఈరోజు మీ శ్రమ ఫలిస్తుంది.

పరిహారాలుః ఈరోజు కుబేర అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news