దీపావళి కి గిఫ్ట్స్ కొంటున్నారా..? ఇవి మాత్రం ఇవ్వకూడదట..!

-

ఈ ఏడాది పండుగ ఎప్పుడు వచ్చింది అనేది చూస్తే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న వచ్చింది. అయితే అక్టోబర్ 25న సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుందిట. అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుందని దీపావళి అక్టోబర్ 24న అని అంటున్నారు పండితులు.

అయితే దీపావళి నాడు పాటించాల్సిన విషయాలు కూడా వున్నాయి. దీపావళి నాడు మరి చేయకూడనివి ఇప్పుడు చూద్దాం. దీపావళి నాడు ముగ్గులు వేసినప్పుడు నలుపు రంగుని కానీ బ్రౌన్ కలర్ ని కానీ ఉపయోగించకండి. దీపావళి నాడు చాలామంది బహుమతులను ఇస్తుంటారు. అటువంటప్పుడు లెదర్ వస్తువులను ఇవ్వకూడదు.

దీపావళికి ఈ బహుమతులు ఇవ్వకూడదు:

దీపావళి నాడు ఈ బహుమతులను అస్సలు ఇవ్వకూడదు అని పండితులు అంటున్నారు. దీపావళినాడు బహుమతి కింద జేబు రుమాలు ఇవ్వడం వల్ల దూరం పెరిగిపోతుంది. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం వాచీని కూడా ఈ బహుమతి కింద ఇవ్వకూడదు. దీని వల్ల కూడా సమస్యలు కలుగుతాయి.

అలాగే ప్రకృతికి సంబంధించిన సీనరీలను కూడా చాలా మంది ఇస్తారు కానీ ఎడారి, మునిగిపోతున్న షిప్, సూర్యాస్తమయం అవుతున్న సీనరీలు వంటివి ఇవ్వకూడదు. వీటి వల్ల కూడా సమస్యలు వస్తాయి. అలానే బహుమతుల కింద మృగాలు వంటి వాటిని కూడా ఇవ్వకూడదు. పులి, సింహం వంటి ఫోటోలని బహుమతి కింద ఇవ్వకూడదు కాబట్టి దీపావళికి మీరు ఎవరికైనా బహుమతులు కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. వీటి వలన సమస్యలు కలుగుతాయి కనుక ఎవరికీ వీటినివ్వద్దు.

Read more RELATED
Recommended to you

Latest news