దీపిక కొత్త ఇల్లు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!!

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి సుపరిచితురాలు.ఎన్నో సినిమాలలో నటించి ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె వరుస సినిమాలో చేస్తూ దూసుకుపోతూ కొత్తగా వచ్చే యంగ్ హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తుంది. ఇక ఈమెకు సంబంధించిన ఏదో ఒక వార్త ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే దీపిక పదుకొనే, రణవీర్ సింగ్ దంపతులు కొత్తగా ఇంట్లోకి అడుగు పెట్టినట్లు సమాచారం. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ జంటకు విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పవచ్చు.Deepika Padukone and Ranveer Singh perform Griha Pravesh puja at new Alibaug home - FIRST PICS! | People News | Zee News

ఇకపోతే ముంబై సముద్ర తీరంలోని అలీబాగ్ లో తన ఇంటిలోకి పూజా కార్యక్రమాలతో గృహప్రవేశం చేశారు ఈ జంట. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడయా వేదికగా అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఇకపోతే ఈ భవనం మొత్తం 2.5 ఎకరాలలో విస్తరించి ఉంది అని అందులో ఐదు బెడ్ రూమ్ లు కూడా ఉన్నాయని సమాచారం. ఇక మొత్తం ఈ ఇంటి ధర రూ. 22 కోట్లు అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రన్వీర్, దీపిక ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో నివసిస్తున్నారు. కొత్త ఇంటిని విడిది కేంద్రంగా ఉపయోగించుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే దీపిక, రన్వీర్ లు ఇద్దరూ 83 సినిమాలో జంటగా మెరిశారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్న మొదటి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. దీపికా పదుకొనే సినిమాల విషయానికి వస్తే షారుక్ ఖాన్ పఠాన్ మూవీలో, హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రాలలో బిజీగా ఉంది. అంతేకాదు తెలుగులో ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కే లో కూడా నటిస్తోంది. ఇక రణవీర్ ప్రస్తుతం రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని, సర్కస్ తదితర సినిమాలలో బిజీగా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news