కులం పేరుతో పవన్‌ కళ్యాణ్‌ను తిడుతున్నారు – చంద్రబాబు

-

ఏపీ రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అరటి తోటలు తగెలేస్తే ఎంపీ.. బట్టలు ఊడదీసుకుని తిరిగితే కేంద్రంలో మంత్రి అయిపోతారేమో..? అంటూ ఎద్దేవా చేశారు. కులాల గురించి మాట్లాడితే చెప్పు చూపించే పరిస్థితి రావాలని పిలుపునిచ్చారు. జనసేన గురించి.. పవన్ గురించి మాట్లాడుతున్నారు… అదే కులం వాళ్లతో పవన్ను తిట్టిస్తున్నారని ఆగ్రహించారు.

మరొకరితో నన్ను తిట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. చేతకాని వాడే కులాల గురించి మాట్లాడతారని నా అభిప్రాయమని… అన్ని కులాలు నా కులాలే అన్నారు. అనంతపురంలో కియా పెడితే బడుగులకే ఎక్కువ లబ్ది చేకూరిందని… కుప్పంలో 100 కమ్మ కుటుంబాలు కూడా ఉండవని పేర్కొన్నారు. నాకు ఓట్లేసి గెలిపించింది బడుగులేనని… ఏ కులంలో పేదరికం ఉంటే.. ఆ కులానికే నా ప్రాధాన్యత ఇస్తామనన్నారు.
జగనుకు అడ్డం వస్తే రెడ్లను కూడా తిడతాడు… ప్రస్తుతం కాపులను తిడుతున్న జగన్.. త్వరలోనే రెడ్లను తిడతారేమో..? అంటూ మండి పడ్డారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news