ఆత్మలతో మాట్లాడాలి అంటూ 17 ఏళ్ల బాలిక 2 నెలల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఇప్పటికీ ఆ బాలిక తిరిగి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల అనుష్క ఆత్మలు ఉన్నాయని గట్టిగా నమ్మింది. తరచూ ఆత్మలతో మాట్లాడుతున్నాను అంటూ ఇంట్లో వాళ్లకు చెప్పడం మొదలు పెట్టింది. ఇంట్లో వాళ్ల ముందు కూడా గాలిలో మాట్లాడుతూ తాను ఆత్మ తో మాట్లాడుతున్నా అంటూ చెప్పేది.
అనుష్క తల్లిదండ్రులు అర్చన అభిషేక్ కాగా వాళ్లు ఎంత చెప్పినా వినేది కాదు. ఈ క్రమంలో తాను బయట ధ్యానం చేసుకుంటూ అక్టోబర్ 31వ తేదీన రెండు జతల దుస్తులు రూ. 2500 నగదు తో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటినుండి అనుష్క ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. అనుష్క ఇంటర్ పూర్తి చేసినట్టు సమాచారం. ఇప్పటికే అనుష్క కోసం పోలీసులు గాలిస్తున్నారు.