గిల్గిట్‌-బల్టిస్థాన్‌లు మావే.. స్వాధీనం చేసుకుంటాం : రాజ్‌నాథ్‌ సింగ్‌

-

పాకిస్థాన్ పై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్రంగా ఫైర్ అయ్యారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాక్‌ ఈ అరాచకాలకు తగిన ప్రతిఫలం అనుభవిస్తుందని హెచ్చరించారు. గిల్గిట్‌-బల్టిస్థాన్‌లను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. జమ్ముకశ్మీర్‌, లద్ధాక్‌ల్లో అభివృద్ధి లక్ష్యాలు వాటి స్వాధీనంతోనే పూర్తవుతాయని అన్నారు.

శ్రీనగర్‌లో నిర్వహించిన ‘శౌర్య దివస్’ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొని ప్రసంగించారు. భారత్‌పై గురిపెట్టడమే ఉగ్రవాదుల లక్ష్యమని తెలిపారు. కేంద్రం ఆర్టికల్‌ 370ని తొలగించడంతో జమ్ముకశ్మీర్‌లో ప్రజలపై వివక్ష తొలగిపోయిందని అన్నారు. ప్రధాని మోదీ హయాంలోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా భారత సైన్యం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను రాజ్‌నాథ్‌ సింగ్‌ సందర్శించారు.

భారత్‌ భూభాగంపై జరిగిన తొలిదాడిని 1947 అక్టోబర్‌ 27 సైన్యం తిప్పికొట్టింది. సిక్కు రెజిమెంట్‌లోని 1వ బెటాలియన్‌ అద్భుతమైన ధైర్యసాహసాలను ప్రదర్శించింది. దీనిని పురస్కరించుకొని ఆర్మీ ‘ఇన్‌ఫాంట్రీ డే’ను జరుపుకొంటుంది. ఆ యుద్ధంలో వాయుసేన తొలి విమానం శ్రీనగర్‌లో ల్యాండ్‌ అయింది కూడా అక్టోబర్‌27నే. ఈ నేపథ్యంలో సైన్యం, వాయుసేన కలిసి శౌర్యదివస్‌ను నిర్వహించుకొంటున్నాయి. శ్రీనగర్‌లో వాయుసేన బేస్‌ ఏర్పాటు చేసి నేటితో 50 ఏళ్లు  పూర్తయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news