డైరక్టర్, ప్రొడ్యూసర్స్ కు మంచి అవకాశం.!

-

దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఈగ, మగదీర బాహుబలి 1,2 , ఆర్ ఆర్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటి విజయాలకు రాజమౌళి ప్రతిభ తో పాటు, తన తండ్రి గారైన విజయేంద్ర ప్రసాద్ కథలు కూడా చాలా ప్రముఖ పాత్ర పోషించాయి. దీనికి ప్రధాన కారణం రాజమౌళి మనస్తత్వం ఆయనకి  పూర్తిగా అర్ధం కావడమే.

రాజమౌళి నిద్రలో లేచి వచ్చి ఐడియా చెప్పినా, లేదా థీమ్ చెప్పి కథ తయారు చేయమన్నా కూడా విజయేంద్ర ప్రసాద్ అందుకు తగ్గట్టుగానే సిద్దంగా వుంటాడు. ఎందుకంటే ఆయన వద్ద గుట్టలు గుట్టలుగా కథలు వున్నాయి. వాటితో తానే స్వయంగా డైరెక్షన్ చేద్దామని ప్రయత్నించుదామని అనుకున్నా వయస్సు సహకరించే విధంగా లేదు. అదీకాక తన సినిమాలు చూసి మీరు డైరెక్టర్ గా నెగ్గుకు రాలేరు ఓన్లీ రైటింగ్ మీదే దృష్టి పెట్టండి అని రాజమౌళి స్మూత్ గా చెప్పాడట.

vijayendraprasad

దీనితో విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడున్న మిగిలిన డైరక్టర్, ప్రొడ్యూసర్స్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారట.ఇప్పుడు తన కథలన్నీ ఎవరైనా మంచి దర్శకులు కథల కోసం వస్తే వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. వాస్తవానికి విజయేంద్ర ప్రసాద్ కధలు లార్జర్ దెన్ లైఫ్ గా వుంటాయి. ఆ కథల ను కనుక కరెక్ట్ గా చూపించ గలిగితే వండర్స్ క్రియేట్ అవుతాయి. మరి మన డైరెక్టర్స్ ఎవరైనా ఈ కథలను తీసుకొని సినిమా చేస్తారేమో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news