ఫామ్ హౌస్ వీడియోలు జబర్దస్త్ కామెడీ షోని తలపించాయి – బండి సంజయ్

-

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మీడియా సమావేశంలో మూడు గంటలు నిడివితో ఉన్న ఓ వీడియోని కుదించి అనంతరం ఆ వీడియోలను మీడియా ప్రతినిధులకు అందించారు. మీడియా సమావేశంలో కూడా ప్రదర్శించారు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించడంపై తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్.

తమ ప్రభుత్వాన్ని కూలగొడతామని చెబుతుంటే ఊరుకొని మౌనంగా ఉండాలా? అని ప్రశ్నించారు. అయితే సీఎం కేసీఆర్ బయటపెట్టిన వీడియో పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు. ఇటీవల వీక్షించిన వీడియోలు జబర్దస్త్ కామెడీ షో ని తలపించాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు బండి సంజయ్. ” కాపీ చేసిన తెలివిగా చేయాలి. సినిమా పేరు ఫామ్ హౌస్ డ్రామా.. ఇందులో యాక్టర్స్, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రచయిత, డైరెక్టర్, ప్రొడ్యూసర్ సీఎం కేసీఆర్” అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news