దేశంలోనే మొదటిసారిగా పొగమంచు టవర్.. ప్రారంభించనున్న ఢిల్లీ ముఖ్యమంత్రి

-

ఢిల్లీలో కాలుష్యం ఎంత విపరీతంగా ఉందో చెప్పాల్సిన పనిలేదు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనుషులు తిరగడానికి కూడా సౌకర్యంగా లేదని నిపుణులు తేల్చేసారు. చిన్న పిల్లలపై మరింత ప్రభావం ఉంటుందని చెప్పారు కూడా. ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి రకరకాల పనులు చేస్తున్నారు. అందులో భాగంగానే పొగమంచు టవర్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ టవర్ ఏర్పాటుకు అక్టోబర్ 2020లో ఢిల్లీ కేబినేట్ నుండి అనుమతులు వచ్చాయి. ఈ పొగమంచు టవర్ కారణంగా వాతావరణంలో ఉన్న కాలుష్యం తగ్గిపోతుంది.

మనం పీల్చే గాలి పరిశుద్ధంగా మారుతుంది. 20మీటర్ల ఎత్తున్న ఈ టవర్, ఒక కిలోమీటర్ పరిధిలోని గాలినంతటినీ శుభ్రపరుస్తుంది. ఢిల్లీ ప్రభుత్వం అందించిన నిధుల ప్రకారం సుమారు 20కోట్లతో ఈ టవర్ నిర్మించారు. వర్షాకాలం పూర్తయ్యాక ఈ పొగమంచు టవర్ పూర్తిగా పనిచేయనుందని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version