శృంగారంలో సంతృప్తి కావాలంటే ఈ ఒక్క అలవాటు చేసుకుంటే చాలు..

భార్యాభర్తల మధ్య భాగస్వామ్యాన్ని పదిలంగా ఉంచే చాలా వాటిల్లో శృంగారం ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పాలి. కానీ ఆ శృంగారం కేవలం భౌతిక అవసరానికి మాత్రమే కాకుండా ఉండాలి. అలాంటప్పుడే శృంగారంలో శిఖరాగ్ర స్థాయి అనుభూతిని పొందగలుగుతారు. అలాంటి అనుభూతిని పొందాలంటే కృతజ్ఞత పెంచుకోవాలి. అవును, భాగస్వామి పట్ల విశ్వాసం పెంచుకుని కృతజ్ఞతతో వ్యవహరిస్తే శృంగారంలో రెచ్చిపోతారు.

వివాహం చేసుకున్న తర్వాత శృంగారం అనేది చాలా ముఖ్యమైన అంశం. అందులో ఆనందాలు అనుభవించాలంటే అవతలి వారి పట్ల మానసికంగా కృతజ్ఞతతో వ్యవహరించాలి. భాగస్వామి అవసరాలను మానసికంగా తీర్చినవారే రతిక్రీడలో ఎక్కువ ఆనందాన్ని పొందారని పరిశోధనలు చెబుతున్నాయి.

భాగస్వామి లైంగిక డిమాండ్లను నెరవేర్చడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ కృతజ్ఞతను తెలుపుకోవడానికి చాలా రకాలు ఉన్నాయి. అప్పుడప్పుడు బయటకు వెళ్ళడం, బహుమతులు ఇచ్చుకోవడం, మాటలు, ప్రేమ ప్రకటనలు కనిపిస్తూ ఉండాలి. దీనివల్ల రతిక్రీడలో మరింత మజాని అనుభవించగలరు. కృతజ్ఞత వల్ల బంధం బలపడుతుంది.

అవతలి వారి పట్ల బాధ్యత కనబడుతుంది. అది వారి మీద ప్రేమని బయటకు కనిపించేలా చేస్తుంది. కాబట్టి శృంగారంలో అత్యంత ఆనందాన్ని అనుభవించగలరు. లేదంటే రెండు శరీరాలు మాత్రమే కలుసుకుంటే వ్యాయామం చేసినట్లుగా ఉంటుంది తప్ప, అందులో పెద్దగా ఫీలింగ్ ఉండదు. శృంగారం అనేది ఇద్దరు భాగస్వాములు ఒకరిపై ఒకరు గెలవడానికి చేసే ప్రక్రియ కాదు. ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమ ప్రకటన. అందుకే ఇద్దరూ తమ భాగస్వాముల పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటే మరింత బాగుంటుంది.