తెలంగాణ బిజెపి నేతల పై బీజేపీ అధిష్టానం ఆగ్రహంగా ఉందా…? అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. వాస్తవానికి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే అనూహ్యంగా కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఒక్కసారిగా బిజెపి అధిష్టానంలో కలకలం మొదలైంది. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం బలహీన పడుతుందని, రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి అన్ని మార్గాలు ఉన్నాయని బిజెపి నేతలు అధిష్టానానికి చెప్పారు.
అదే విధంగా ఈ ఎన్నికల్లో కనీసం 15 నుంచి 20 మున్సిపాలిటీ స్థానాలు గెలుస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు అధిష్టానానికి హామీ ఇచ్చారు. కేసీఆర్ బలహీనపడుతున్నారని కూడా చెప్పినట్టు సమాచారం. నాలుగు పార్లమెంటు స్థానాలు గెలిచిన బీజేపీ కనీసం నాలుగు మున్సిపాలిటీలు కూడా గెలవలేక పోవడంతో బీజేపీ అధిష్టానం ఇప్పుడు తీవ్రంగా కలవరపడుతోంది. కెసిఆర్ ను ఈ ఎన్నికల ద్వారా అడ్డుకోవడమే కాకుండా తెలంగాణ ప్రజలకు కూడా బీజేపీ ఉంది అనే సంకేతాలు ఇవ్వాలని భావించారు.
దీనితో ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేతల మీద ఆ బిజెపి అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఢిల్లీ రావాలని ఆదేశించినట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఢిల్లీ రావాలని బీజేపీ పెద్దలు పిలిచినట్లు తెలుస్తుంది. కనీసం నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ లో కూడా గెలవలేకపోవడం ఏంటీ అని బిజెపి అధిష్టానం రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది.