నీటి వృధా పై ఢిల్లీ వాటర్ బోర్డు కీలక నిర్ణయం..!

-

దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ఢిల్లీలో ఎండల వేడి తట్టుకోలేక అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా 50కి పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఈ తరుణంలో ఢిల్లీ వాటర్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఓ పక్క కరువుతో తాగడానికి కూడా నీళ్లు లేక అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా నీరు వృధా చేస్తే.. 2వేల రూపాయల జరిమానా విధిస్తామని తెలిపింది.

వాటర్ ట్యాంకులు ఓవర్ ఫ్లో అయినా.. మంచి నీటితో కార్లు, ఇతర వాహనాలు కడిగినా, భవన నిర్మాణాలకు వాణిజ్య అవసరాలకు నీటిని వాడినా ఫైన్ కట్టాల్సిందేనని వాటర్ బోర్డు ప్రకటించింది. నీరు ఎక్కడ వృధా అవుతుందో పరిశీలించడానికి ఢిల్లీ వాటర్ బోర్డుకు చెందిన 200 బృందాలు రంగంలోకి దిగనున్నాయి. వాణిజ్య సముదాయాలు, నిర్మాణంలో ఉన్న భవనాలకు ఉన్న అక్రమ తాగునీటి కనెక్షన్లను తొలగించాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news