అప్పుడు డెలివరీ బాయ్..ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి..

-

జీవితం ఎలా ఎదగాలి అని నేర్పిస్తుంది.. కష్టాలు మనిషికి బ్రతకడం నేర్పిస్తుంది..ఆ కష్టం నుంచి కసి పుట్టుకొచ్చి జీవితం పై పట్టు సాధించడం వస్తుందని పెద్దలు అంటున్నారు. అందుకు నిదర్శనంగా ఎంతో మంది జీవితాలు ఉన్నాయి.తాజాగా ఓ డెలివరీ బాయ్ జీవితం ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసిన ఓ యువకుడు ఇప్పుడు ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు..అంత సులువేమీ కాలేదు. ఈ ఘనత వెనుక అతని కష్టం ఉంది. అతని పేరు షేక్ అబ్దుల్ సత్తార్. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

డెలివరీ ఏజెంట్ నుంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వరకు ఇదంతా ఎలా సాధించాడో లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వివరించాడు. అతను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అతని తండ్రి కాంట్రాక్ట్ వర్కర్. కుటుంబ ఆదాయం ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు. అందుకే తాను కూడా కుటుంబానికి సాయంగా ఉండాలని అనుకున్నాడు.దాంతో ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఫుడ్ డెలివరీ బాయ్ గా మారాడు..తన సంపాదన మొత్తం ఇంటికే ఇచ్చేవాడు..

షేక్ అబ్దుల్ సత్తార్ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో ఉన్న సమాచారం ప్రకారం అతనిది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చదివాడు. శ్రీ గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు సాయంత్రం 6 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు ఫుడ్ పార్శిల్స్ డెలివరీ చేసేవాడినని చెప్పాడు.మొదట్లో డెలివరీ ఏజెంట్‌గా పనిచేయడానికి సిగ్గుపడేవాడినని, కానీ ఆ తర్వాత చాలా విషయాలు నేర్చున్నానని తెలిపాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఈ ఉద్యోగం ఉపయోగపడిందని అన్నాడు. ఒక ఫుడ్ మాత్రమే కాదు..ఒలా,ఉబెర్ సంస్థల్లో కూడా పని చేసినట్లు వివరించాడు.ఏదైనా సాధించాలని ఉంటే మాత్రం ఎవరైనా సక్సెస్ అవుతారని నిరూపింఛాడు..మొత్తానికి ఇతని పేరు సోషల్ మీడియాలో మారుమోగి పోతూంది..

Read more RELATED
Recommended to you

Latest news