బరువు మోసే వ్యక్తి: యువ ఎంపీకి టీడీపీ పగ్గాలు… లాజిక్ ఇదే!

-

ఏపీ టీడీపీలో బాబు అనంతరం నాయకత్వ లోటు కనిపిస్తుందనే టాపిక్స్ బలంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు తర్వాత ఎవరు అనే విషయంలో కొందరు సీనియర్ల పేర్లు వినిపిస్తున్నా.. వాటికి అంతగా రెస్పాన్స్ రావడం లేదనే చెప్పుకోవాలి. అసలు ఈ సమయంలో ఆ టాపిక్ ఎందుకు అనేవారికి… యువరక్తం పార్టీకి చాలా అవసరం అనే సమాధానాలు వస్తున్నాయి. అందుకు లోకేష్ ఉన్నాడుగా అనే ప్రశ్న వెంటనే ఉత్పన్నమవుతున్నా… అందుకు సరైన స్పందన రావడం లేదంట. ట్విట్టర్ లో స్పందించే వారి చేతిలో పార్టీ పెట్టడం కంటే.. మాస్ లో బాగా ఫాలోయింగ్ ఉన్న యువ నాయకుడి చేతిలో పార్టీని పెట్టడం భావ్యం అనే వాదన బలపడుతుందట. ఈ సమయంలో అనూహ్యంగా బయటకు వస్తున్న పేరు… రామ్మోహన్ నాయుడు!

అవును… కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరుతో ఫేక్ అకౌంట్ల నుంచి మసాలా ట్వీట్లు పడుతున్నాయి. బరువు మాత్రమే ఉన్న వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా.. బరువు మోసే వ్యక్తికి పార్టీని అప్పగిస్తారా తేల్చుకోండి అంటూ ట్వీట్లు పడుతున్నాయి. వారి దృష్టిలో బరువు మాత్రమే ఉన్న నాయకుడు ఎవరు అనేది ఇప్పుడు అప్రస్తుతం. ఈ క్రమంలో రామ్మోహన్ నాయుడుకి టీడీపీ పగ్గాలు అప్పగించాలి అనే వాదన ఆన్ లైన్ వేదికగా బలంగా మొదలైందన్నమాట. ఈ విషయాలపై రామ్మోహన్ నాయుడు క్లారిటీ ఇచ్చినా… ఉత్తరాంధ్ర కేంద్రంగా ఈ డిమాండ్ మాత్రం బాగా వినిపిస్తోంది.

దీనికి వారు తీస్తున్న లాజిక్… నాడు ఎన్ టీఆర్ – లక్ష్మీపార్వతి సంఘటన గురించి! బందువులూ, రక్తసంబంధికులు మాత్రమే వారసులుగా ఉండాలనుకోలేదు, వ్యక్తుల కంటే పార్టీ గొప్పది అని నమ్మబట్టే కదా నాడు లక్ష్మీపార్వతి చేతిలోకి పార్టీ వెళ్లిపోతే భవిష్యాత్తు ఉండదనే కదా… పెద్దాయనను కిందకు దింపి బాబు కుర్చీ ఎక్కింది. నాడు గుర్తున్న పార్టీ భవిష్యత్తు నేడు ఎందుకు గుర్తురావడం లేదని ఆ వర్గం వాదన. కాస్త లాజికల్ గా ఆలోచిస్తే అది కూడా కరెక్టే కదా. వ్యక్తుల కంటే వ్యవస్థ.. వారసుల కంటే పార్టీ ఎప్పుడూ గొప్పవే కదా! ఈ విషయంలో పుత్ర ప్రేమను పక్కనపెట్టి… బాబు కాస్త పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే… రామ్మోహన్ నాయుడు పేరు సబబే అంటున్నారు తమ్ముళ్లు!

Read more RELATED
Recommended to you

Latest news