2019 ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకొని అధికారం చేపట్టారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయన ప్రతిపక్షాన్ని టార్గెట్ చేశారు. దీంతో గెలిచిన ఎమ్మెల్యేలు కొందరు టీడీపీ నుంచి బయటకి వెళ్ళిపోయి జగన్ కి తమ మద్దతు తెలిపారు. అలాగే కొంతమంది టీడీపీ నేతలను నేరుగా తమ పార్టీలోనే చేర్చుకున్నారు. అలాగే ఇవాళ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బెదిరింపులు, ప్రలోభాలతో తమ పార్టీ వారిని వైసీపీ పార్టీ లోబర్చుకుంటోందని ఆక్షేపించారు. వేధింపులకు భయపడే కొందరు నేతలు పార్టీని వీడుతున్నారని వ్యాఖ్యానించారు. భయపడో, ప్రలోభాల కోసమో పార్టీ మారడం పిరికితనమని బాబు అన్నారు.