తెలుగు దేశం ఒకప్పుడు ఎదురులేని పార్టీగా చలామణి అయిన ఈపార్టీ ఇప్పుడు తన ఉనికిని చాటుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో టీడీపీ వెంట ఉండాల్సిన కొంత మంది నాయకులు ఆధిపత్యం చలాయించేందుకు సొంత నాయకులపైనే విమర్శలకు దిగుతున్నారు.దీంతో చంద్రబాబు నాయుడు తలపట్టుకుంటున్నాడు. పార్టీలో ఉందే కొద్ది మంది అందులోనూ ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదని సన్నిహితులు చర్చించుకుంటున్నారు. ఇది వినడానికి కొంత ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజమని వారు అంటున్నారు. ఏదైనా చర్య తీసుకుందామా అంటే పార్టీని వీడుతామని హెచ్చరిస్తుండడంతో చంద్రబాబు ఏం తోచని స్థితిలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్ననే కదా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
టీడీపీ రాజీనామా చేస్తనని ప్రకటించి చంద్రబాబు, లోకేష్‌లపై తిట్టిపోశారు. ఆయనను పార్టీ వీడకుండా స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగారు. దీంతో బుచ్చయ్య మనసు మార్చకొని పార్టీలోనే ఉంటనని తెలిపారు. పార్టీ అభివృద్దికి కృషి చేస్తనని చెప్పారు. కానీ బుచ్చయ్య చంద్రబాబుతో భేటి అయిన సందర్భంగా చాలా వరకు డిమాండ్లు పెట్టినట్టు సమాచారం. మూలిగే నక్కపై తాటిపడ్డట్టు అసలే కోలుకోలేని స్థాయిలో ఉన్న టీడీపీలో ఉండేవారెవరో.. వీడేవారెవరో చూడాలి. ఇప్పటికే వైసీపీ టీడీపీ నాయకులపై పాత కేసులు తోడుతుండడంతో చాలా వరకు టీడీపీని వీడుతున్నారు. ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, టీడీపీలో ముఖ్య నాయకులు కీలకమైన నీర్ణయాలు తీసుకుంటూ కింది స్థాయిలో క్యాడర్‌లో జోష్ నింపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలకు దగ్గరవ్వడమే టీడీపీకి ముందున్న టాస్క్. దీంతోనైనా టీడీపీ బలోపేతం అవుతోందో చూడాలి.