ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. తెలుగు చిత్రసీమలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సినిమా వాళ్లెవరూ వ్యక్తిగతంగా కలవడానికి రావద్దన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు రాష్ట్రముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా? అని మండిపడ్డారు.

గత ప్రభుత్వం సినిమా రంగం వారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిం దో మరిచి పోయారు, కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు.. సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందన్నారు. ఇకపై ప్రభుత్వం తో వ్యక్తిగత చర్చలు ఉండవు. సినీ సంఘాల ప్రతినిధులే రావాలని హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తాను అని తెలిపారు.