రాష్ట్రంలో 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ లుగా పని చేస్తున్న ఆర్ డి మాధురి, రోహిత్ సింగ్, పద్మశ్రీ, గుగులోతు లింగ్యా నాయక్, మహమ్మద్ అసదుల్లా, రవికుమార్, రాజ్యలక్ష్మి, స్వర్ణలత, వెంకటేశ్వర్లు, భుజంగరావు, వెంకట మాధవరావు, వెంకట భూపాల్ రెడ్డి, శ్రీనివాసులు, తిరుపతిరావు, మహేందర్, గంగాధర్, కిషన్ రావు, సూరజ్ కుమార్, వెంకట చారి, విక్టర్, కిషోర్ కుమార్, అశోక్ కుమార్, విజయలక్ష్మి, శ్రీనివాస్, విజయేందర్ రెడ్డి, శ్యామలాదేవి, వీర బ్రహ్మచారి, హరిప్రియ, లక్ష్మీ కిరణ్, హరి ప్రియ, వేణు, సంగీతలకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో గురుకుల విద్యను మరింతగా విస్తరించేందుకు కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న గురుకులాలకు అదనంగా కొత్తగా 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలు, 33 గురుకులాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం కొత్త గురుకులాల ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం జారీ చేసింది. గురుకులాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీటిలో నాణ్యమైన విద్యను ఉచితంగానే అందిస్తున్నారు. ఈ కారణంగా ఇటీవలి కాలంలో గురుకులాల్లో అడ్మిషన్ల కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ కారణంగా కొత్త గురుకులాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.