కరెన్సీ నోట్లతో దేవి దర్శనం.. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు

-

మెదక్​ జిల్లా కేంద్రంలోని రేణుక మాతా ఆలయంలో అమ్మవారికి రూ. 5 లక్షల 21 వేలతో ధనలక్ష్మి రూపంలో అలంకరించారు. శ్రావణమాస చివరి మంగళవారాన్ని పురస్కరించుకుని రూ. రెండు వేలు, ఐదు వందలు, రెండు వందలు, వంద రుపాయలతో ఆలయ పూజారులు శ్రీనివాస్, వేదవ్యాస్, ప్రభాకర్​లు అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అమ్మవారిని అభిషేకం, సహస్రనామ అర్చన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.

maha devi
maha devi

ఆలయ అధ్యక్షుడు కొండన్​ సురేందర్​గౌడ్ ఆధ్వర్యంలో రేణుకామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులు భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కరోనా విస్తరిస్తున్న సమయం కాబట్టి పెద్ద గా భక్తులను లోపలికి రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు. జన సాంద్రత ఎక్కువ లేకుండా భక్తులు దర్శనం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో శ్రావణ్​గౌడ్, యాదగిరి గౌడ్, దామోదర్ గౌడ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news