Bandla Ganesh: ‘డేగల బాబ్జీ’గా బండ్ల గణేశన్న వచ్చేస్తున్నాడహో..రిలీజ్ డేట్ లాక్‌డ్

-

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, యాక్టర్ బండ్ల గణేశ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులు ఉండబోరు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘డేగల బాబ్జీ’. ఈ సినిమాలో బండ్ల గణేశ్ తన నట విశ్వరూపం చూపించనున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేశ్ ఈ పిక్చర్ లో లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు.

బండ్ల గణేశ్ తాజాగా ‘డేగల బాబ్జీ’ పిక్చర్ అప్ డేట్ ఇచ్చేశారు. తాను కథానాయకుడిగా నటిస్తున్న సినిమా రిలీజ్ డేట్ ను ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఈ నెల 20న సినిమా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు.

మంగళవారం రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విషయమై ట్వీట్ చేశారు బండ్ల గణేశన్న. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నది. ‘‘ఒత్తు సెరప్పు సైజ్ 7’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ పిక్చర్ కు వెంకట్ చంద్ర దర్శకత్వం వహించారు.

ఇక ఇప్పటి వరకు సినిమా ఆడియో ఫంక్షన్లలోనే తన మాటల ద్వారా విశ్వరూపం చూపించిన బండ్ల గణేశన్న..ఈ చిత్రంలో డెఫినెట్ గా తన నట విశ్వరూపం చూపిస్తారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ‘డేగల బాబ్జీ’ చిత్రంలో విభిన్నమైన పాత్రలను బండ్ల గణేశ్ పోషించిన సంగతి పోస్టర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ఎస్.స్వాతి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news