వైసీపీ సరికొత్త అర్ధం చెప్పిన దేవినేని.. ఏంటో తెలుసా..!

-

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలను మూడు భాగాలుగా చేసి వాటి బాధ్యతలను వైసీపీ ముఖ్య నాయకులకు అప్పగించడం పట్ల టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ బాధ్యతలు, రాష్ట్రంలోని ముఖ్య వ్యవహారాలు ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు. ఈ విషయమై ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘వైఎస్‌ఆర్‌లో వై అంటే-వైవీ సుబ్బారెడ్డి(మీబాబాయ్)కి 5 జిల్లాలు,ఎస్‌-సాయిరెడ్డి(ఆర్థిక నేరాలు)కి 3 జిల్లాలు, ఆర్‌-రామకృష్ణారెడ్డి(సాక్షి, ప్రభుత్వ సలహాదారు)కి 5 జిల్లాలు పంచారు.

సెర్చ్ కమిటీల్లో12, వర్సిటీ ఈసీల్లో 46 మంది మీ బంధువులే. మీ ప్రభుత్వ పెత్తందారీ నియామకాలపై శ్వేతపత్రం విడుదలచేసే ధైర్యం ఉందా?’ అని దేవినేని ఉమ నిలదీశారు. ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన వార్తలను దేవినేని ఉమ పోస్ట్ చేశారు. ఏపీలోని 13 జిల్లాలను ముగ్గురికి పంచారంటూ సీపీఐ నేతలు చేసిన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news